FbTelugu

ఏపిలో 4వారాల కర్ఫ్యూ తప్పదా?

తాడేపల్లి: రాష్ట్రంలో కర్ఫ్యూను మే నెలాఖరు వరకూ పొడిగించాలని సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని సిఎం పేర్కొన్నారు.

ఏపిలో కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందని, గ్రామీణ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎం ఆదేశించారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కరోనా పాజిటివ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారి సంతానాన్ని ఆదుకునేలా ఆర్థిక సహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలని ఉన్నతాధికారులను కోరారు. వారిపేరుమీద కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అధికారులకు సిఎం జగన్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.