FbTelugu

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ 70 శాతమేనా?

వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా, వెంటనే వేసుకుని హాయిగా తిరుగుదామా అని జనాలు ఎదురు చూస్తున్నారు. గత రెండు వారాలుగా పలు కంపెనీలు వ్యాక్సిన్ విజయవంతంపై శుభవార్తలు చెబుతున్నాయి.
డిసెంబర్ నెలలో ఒకటి రెండు కంపెనీలు విడుదల చేసే అవకాశం ఉండడంతో ప్రజలు సంతోషపడుతున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విజయవంతంపై ఆ కంపెనీ ఇవాళ కీలక ప్రకటన చేసింది. దీని సగటు సామర్థ్యం 70 శాతంగా ఉందని వెల్లడించింది. ప్రయోగాత్మక పరిశీలన సమాచారంపై జరిపిన తొలి విశ్లేషనలో వలంటీర్లలో సగటున 70 శాతం మందిని రక్షించిందని తెలిపారు. ప్రయోగాత్మక పరిశీలనలో రెండు రకాల డోసులు వలంటీర్లకు ఇచ్చారు.
మొదటి విధానంలో వలంటీర్లకు తొలుత సగం డోసు, ఆ తరువాత ఫుల్ డోస్ ఇచ్చారు. ఇందులో సామర్థ్యం 90 శాతంగా వెల్లడైంది. రెండో విధానంలో 62 శాతం సామర్థ్యం చూపినట్లు తేలింది. సగం డోసుకే 90 శాతం పనిచేస్తుండడంతో, ఇదే విధానాన్ని కొనసాగించాలని ప్రపంచ దేశాల కు సూచిస్తామని ఆస్ట్రాజెనెకా ప్రతినిధి ఒకరు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.