FbTelugu

వరద సాయం 10 వేలు అందేనా?

* మీసేవాల వద్ద జనం బారులు
* ప్రారంభం కాని ఆన్లైన్ సేవలు

హైదరాబాద్ : రూ.10 వేల వరద సాయం అందించేందుకు ఆన్లైన్ సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో మీసేవా సెంటర్ల వద్ద జనం బారులు తీరారు. నగరంలో వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు ఇంటికి రూ.10 వేలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వదర సాయాన్ని ఆపేయాలంటూ.. ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికలు అయిపోయేంత వరకు వరద సాయాన్ని నిలిపివేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, వరద సాయం ఇవ్వకపోతే ఎలా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. బాధితులు ఆందోళన చేపట్టడంతో పోలీసులు బాధితులను ఇండ్లకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.