FbTelugu

పతంజలి ఆవాల నూనె కరెక్టు కాదా?

జైపూర్: పతంజలి యోగా సంస్థ దేశ వ్యాప్తంగా విక్రయిస్తున్న పలు సరకులపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహజసిద్దమైన సరకుల పేరుతో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రత్యర్థి సంస్థలు విమర్శిస్తునే ఉన్నాయి.
పతంజలి యోగా సంస్థ అధిపతి అయిన రామ్ దేవ్ బాబా ఇటీవల అల్లోపతిక్ వైద్యం పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కరోనా కు అల్లోపతిక్ లో వైద్యం లేదని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం పతంజలి తయారు చేసిన ఆవాల నూనె నమూనాలను పరీక్ష చేయించింది. అల్వార్ నగరంలోని ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ల్యాబ్ లో పరీక్షించారు. సింఘానియా ఆయిల్ మిల్లు నుంచి పతంజలి సంస్థ కొనుగోలు చేసి విక్రయిస్తున్నది. మొత్తం ఐదు నమూనాలు నాణ్యతా పరీక్షలలో విఫలమయ్యాయి.

ఆవనూనెపై స్థానిక అధికారుల సమక్షంలో పరీక్షించామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఓం ప్రకాశ్ మీనా తెలిపారు. ఇదే కాకుండా మరో గురువు రవిశంకర్ కు చెంది శ్రీశ్రీ తత్వ బ్రాండ్ అవాల నూనె లో కూడా ఇదే రిపోర్టు వచ్చిందన్నారు. ఈ రిపోర్టు లపై సమీక్షించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్, సింఘానియా ఆయిల్ మిల్లులపై దాడులు చేయాల్సిందిగా ఆదేశించారు. సిఎం ఆదేశం మేరకు సింఘానియా మిల్లుపై అధికారులు మెరుపు దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో పతంజలి ప్యాకింగ్ లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన తరువాత మిల్లును సీజ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.