FbTelugu

మోదీకి ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందా?: సిపిఐ

చిత్తూరు: వ్యాక్సిన్ ఉచిత పంపిణీ విషయం లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ చురకలు అంటించారు.
కరోనా వ్యాక్సిన్ విషయంలో అనేక రాష్ట్రాలు మొదటి నుంచి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా ఇంతకాలం మోదీ పెడచెవిన పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రమే వాక్సిన్ సరఫరా చేస్తుందని ప్రధాని ప్రకటన చేయడం హర్షదాయకం అని అన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధానికి ఈ విషయంలో అనేక లేఖలు కూడా రాశారని గుర్తు చేశారు. ఈ జ్ఞానోదయం ఇంతకు ముందే కలిగి ఉంటే లక్షలాది మంది ప్రజల ప్రాణాలు నిలిచేవని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మోదీకి బుద్ది వచ్చినందుకు సంతోషం అని వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్రాల పట్ల పక్షపాత వైఖరి లేకుండా అందరికీ సమానంగా వ్యాక్సిన్లు పంపిణీ కి చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.