FbTelugu

ఆదిపురుష్ లో కీర్తి సురేష్ లేదా?

ముంబై: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆది పురుష్ పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీ సిరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా ప్రేక్షకులను కనువిందు చేయనున్నాడు.

ఎన్నో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రంలో కీర్తి సురేష్ సీత పాత్రలో నటించనున్నదని నిన్నటి దాకా విన్నాం. తాజాగా హిందీ నటి కైరా అద్వానీ పేరు విన్పిస్తోంది. తెలుగు, హిందీ భాషలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో కైరాను ఎంపిక చేశారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

అయితే ఈమె ను ఎంపిక చేశారా అంటే అది కూడా స్పష్టం కావడం లేదు. రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్ర విషయాన్ని ఓం రావత్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.

You might also like