FbTelugu

కెసిఆర్ ఆస్తులపై చర్చకు సిద్ధమేనా?: ఈటల జమున సవాల్

కులం పేరుతో తెలంగాణలో పాలన

సమైక్య ఆంధ్రలో ఇన్ని ఇబ్బందులు పెట్టలేదు

ప్రగతి భవన్ గడీ ముందు ఎవరైనా ఒకటే

నమస్తే తెలంగాణ చూసి ఛీ అంటున్నారు

ఆ పత్రికకు నా భూమి తాకట్టు పెట్టాను

ఈటల జమున ధ్వజం

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోకి రాక ముందు కెసిఆర్ కుటుంబ ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఎంత..? చర్చకు సిద్ధమేనా అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య ఈటల జమున సవాల్ విసిరారు. పోలీసులు మా కుటుంబం కోసమే పని చేస్తున్నారా?, సమైక్య పాలనలో కూడా ఇన్ని ఇబ్బందులు లేవు అని ఆమె మండిపడ్డారు.

కెసిఆర్ కు నచ్చకపోవడంతో ఇప్పుడు రెడ్డి-ముదిరాజు కులం వాళ్లమని గుర్తుకు వచ్చిందా..?. కులాల పేరుతో తెలంగాణలో పాలన చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. తన కుమారుడు ఈటల నితిన్, సాద కేశవ రెడ్డి, సుధాకర్ రెడ్డి తో కలిసి జమున మీడియాతో మాట్లాడారు. ఒక మహిళగా ఛాలెంజ్ చేస్తున్నా అక్రమాలు జరిగినట్లు నిరూపించాలన్నారు. సమైక్యాంధ్రలో ఆత్మ గౌరవంతో బ్రతికినం.. 2014 నుంచి ఆ పరిస్థితులు లేవన్నారు. ప్రగతి భవన్ గేటు వద్దే మూడుసార్లు అప్పాయింట్ మెంట్ లేదని చెప్పి ఆపగా, ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. ఉద్యమంలో ఈటల పెట్టిన డబ్బుల గురించి ఎవరైనా ఆడిగారా..?. నేను వ్యాపారం చేస్తూ ఆయనను ఉద్యమంలోకి పంపాను. నా ఫౌల్ట్రీ వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా ఉద్యమంలో ఈటల అందరిని కాపాడుకున్నారు. ఆయన  ఉద్యమంలో ఎలా ఉన్నాడో ఓయు విద్యార్థులను ఒకసారి అడిగితే చెబుతారన్నారు. నా ఆస్తులు అమ్మి ఐనా సరే మా ఆయనకు అండగా ఉంటానని, తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటంలో ఎంతకైనా సిద్ధమేనని జమున స్పష్టం చేశారు.

గ్యాంగ్ స్టర్ నయీమ్ చంపుతాను అంటే భయపడలేదు, మీకెందుకు భయపడతామని అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈటల కు జ్వరం వస్తే అప్పటి పాలకులు వచ్చి పరామర్శించారు. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి లేదు, కనీసం మర్యాద ఇవ్వడం లేదన్నారు. అధికారం ఉందని ఏమి చేసినా చెల్లుతుందని అనుకుంటే పోరపాటు అన్నారు. వైఎస్సార్ పార్టీలోకి అహ్వానిస్తేనే వెళ్లని వ్యక్తిత్వం ఆయనదని, వకులాభారణం కృష్ణ మోహన్ మొహం చూసి ఒక్క ఓట్లు రాలతాయా అన్నారు. అన్నా అని బతిమలాడితే బిసి కమిషన్ లో సభ్యుడిగా నియామకం జరిగేలా చేశారు. నా ఇంట్లో అన్నం తిన్న వాళ్ళతోనే మమ్మల్ని  తిట్టిస్తున్నారన్నారు. ఉద్యమంలో ఈటల రెండు మూడు రోజులు ఇంటికి రాకపోయినా కూడా దైర్యంగా ఉన్నామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు లేవని ఈటల జమున అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనులు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, బాధ పడుతున్నారని అన్నారు. ఉద్యమం చేసిందే బడుగు బలహీనవర్గాల కోసమని, వారి భూములు మేము ఎలా లాక్కుంటామన్నామని ఆమె తెలిపారు. మెదక్ జిల్లా  మాసాయిపేటలో మోడ్రన్ హ్యాచరీస్ పెట్టాలని 46 ఎకరాలు కొనుగోలు చేశామని తెలిపారు. 46 ఎకరాల కంటే ఎక్కువ భూమిని చూపిస్తే మేము ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. తమది తప్పు అని తేలితే అధికారులు కూడా ముక్కు  నేలకు రాయాలన్నారు. ఇలాంటి అబద్దాలతో బదనాం చేసేందుకేనా తెలంగాణ తెచ్చుకుందని ప్రశ్నించారు. సహాయ సహకారం చేయనవసరం లేదు ఇబ్బంది పెట్టవద్దు కదా అన్నారు. మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్  మొత్తం అక్రమ భూమి అని రాయడానికి పేపర్ వాళ్ళు సిగ్గు పడాలని, నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ చూస్తే ఛీ అంటున్నారు. నమస్తే తెలంగాణ పత్రిక ప్రెస్ బిల్డింగ్ కట్టేందుకు దేవరయాంజాల్ లోని మా భూమిని బ్యాంకులో (భూ కబ్జా వ్యవహారంలో ఉన్న భూమి) తనఖా పెట్టి రుణం ఇప్పించింది మేము కాదా అని కేసీఆర్ ను జమున ప్రశ్నించారు. ఆ రోజు సిఎం కెసిఆర్… ఇది దేవుని పొలమా తమ్మి అని అడగలేదన్నారు. 2008 లో బీవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు కావాలని అడిగితే గోడౌన్ కట్టించి ఇచ్చామన్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ కి కిరాయి రావొద్దు అని కుట్రలు చేస్తున్నారని ఈటల జమున అన్నారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.