* 2 నెలలుగా రైతులపై కేంద్రం నిర్లక్ష్యం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 2 నెలలుగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ..
ఆలిండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. ఆమె ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ప్రభుత్వం తమ కార్పొరేట్ మిత్రులకు ఎర్ర తీవాచీలు పరుస్తూ.. రైతులను మాత్రం నగరంలోకి రానీయకుండా ఢిల్లీ సరిహద్దుల్లో నిలిపేస్తున్నారని మండిపడ్డారు.