FbTelugu

ఇది మ్యాచ్ ఫిక్సింగేనా? : రోజా

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యణ్ పై మరో మారు వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పూర్తిగా బీజేపీకి మద్దతిచ్చి తిరుపతి పార్లమెంటు స్థానం ఇవ్వాలని ఒప్పదం చేసుకున్నారా.. లేక ఇదంగా మ్యాచ్ ఫిక్సింగేనా అంటూ ప్రశ్నించారు.

తిరుపతి ఉప ఎన్నికలో గెలిచేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీనా? బజనసేన పార్టీనా తనకు అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించిన వెంటనే ఎన్నికలకు పోకుండా టీడీపీ, బీజేపీలకు ప్రచారం చేశారన్నారు. కానీ ఆ రెండు పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేశాయన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.