FbTelugu

డబ్బుల కోసమేనా… కట్టుకున్న భార్యను…

గుంటూరు: డబ్బుల కోసం భార్య నగలు అమ్మడం, ఆమె పేరు మీద ఉన్న ఆస్తులు విక్రయించడం ఇప్పటి వరకు చూశాం. తాజాగా వెలుగు చూసిన కొత్త కోణం మహిళలనే నివ్వెరపరుస్తున్నది.
భార్య కు తెలియకుండా తీసిన నగ్న వీడియోల్లో మరిన్ని గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏటీ ఆగ్రహారానికి చెందిన మహిళ నగ్న వీడియోలను ఆమె భర్త చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంపై పోలీసుల విచారణ జరుగుతోంది. ఈ వీడియోల పై భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా, భయానక నిజాలు వెల్లడించాడు.

చిత్రీకరించిన వీడియోలను అప్ లోడు చేయడమే కాకుండా, లైవ్ స్ట్రీమింగ్ యాప్ ద్వారా తన భార్య అశ్లీలంగా ఉన్న దృశ్యాలను డబ్బుల కోసం చూపించేవాడినని చెప్పడంతో పోలీసులే విస్తుపోయారు. లైవ్ లో చూపించేందుకు ఒక సమయం కేటాయించి, ఆ సమయంలోనే వాటిని చూపించేవాడినని అన్నారు. ఈ వీడియోలను చూసిన కొద్ది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరింత సేకరణ కోసం ఐటీ సాయం కోరారు. లైవ్ స్ట్రీమింగ్ లో ఎంత మంది వీక్షించారు, వారెవరు అనే కోణంలో మరింత లోతుగా విచారణ జరుగుతున్నారు. భర్త చేస్తున్న అకృత్యాన్ని, అమానవీయ చర్యపై ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఇదంతా వెలుగు చూసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.