FbTelugu

పీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డి!

ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు?
హైదరాబాద్: పీసీసీ చీఫ్ గా ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖారారు అయ్యింది. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
నూతన అధ్యక్ష పదవి ఎంపికపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మనిక్కం ఠాగూర్ పార్టీ అధినేత్రి సోనియా ను సోమవారం రాత్రి భేటీ అయ్యారు. పదవి కి పోటీ పడుతున్న వారి పేర్లను సోనియా పరిశీలించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ తదితరుల పేర్ల పై చర్చించారు. ప్రధానంగా ఎంపీ రేవంత్ రెడ్డి పేరు పై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. సీనియర్ నాయకులు రేవంత్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో జీవన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు.
తనకు పదవి ఇవ్వక పోయినా పరవాలేదు కానీ రేవంత్ కు పీసీసీ పీఠం ఇవ్వొద్దని సోనియాగాంధీ ని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. మిగిలిన నాయకులు కూడా అభ్యంతరం తెలపడం తో రేవంత్ పేరును పక్కన పెట్టారు.

ఎన్నడూ లేని విధంగా ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే అవకాశం ఉంది. మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, మాజీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, మహేశ్వర్ రెడ్డి పేర్లు దాదాపు ఖారారు చేసారంటున్నారు. అయితే వీరి పేర్లు తరువాత ప్రకటించే పరిస్థితులు ఉన్నాయి. సీతక్క పేరు మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు గా నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ని ప్రచార కమిటీ ఛైర్మన్ గా నియమించనున్నట్లు తెలిసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.