FbTelugu

బిల్ గేట్స్ తో విడాకులకు అతడే కారణమా?

హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మిలిండా గేట్స్ మధ్య విడాకులకు ఒక వ్యక్తి కారణమయ్యాడు. ఆయన మూలంగానే వీరిద్దరు వైవాహిక బంధానికి ముగింపు పలికారు. దీనిపై ఇద్దరు నోరు విప్పనప్పటికీ వాల్ స్ట్రీట్ జర్నల్ ఆసక్తికర కథనం ప్రచురించింది.

వాల్ స్ట్రీట్ జర్నల్ కథన ప్రకారం భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు ఏంటి, గేట్స్ విడాకులకు ఎందుకు అంగీకరించారనేది ఒకసారి చూద్దాం. ఫైనాన్షియర్ అయిన జెప్రీ ఎడ్వర్డ్ ఎప్ స్టిన్ తో బిల్ గేట్స్ సన్నిహితంగా ఉంటున్నారు. ఆయనపై బాలికలు, మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం చేయిస్తారనే ఆరోపణలపై 2019లో జెప్రీని అరెస్టు చేశారు. ఇలాంటి తీవ్రమైన నేరారోపణలు కలిగిన వ్యక్తితో గేట్స్ సన్నిహితంగా ఉండడాన్ని మిలిండా సహించలేకపోయింది. జెఫ్రీతో సంబంధాలు తెగదెంపులు చేసుకోవాలని, లైంగిక ఆరోపణల్లో శిక్షపడ్డ వ్యక్తితో సన్నిహితంగా మెలగడంపై మిలిండా పలుమార్లు అభ్యంతరం చెప్పింది. సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తున్నామని, ఇలాంటి వారితో పరువు బజారునపడుతుందని ఆమె హెచ్చరించినా గేట్స్ పట్టించుకోలేదు.

జెఫ్రీని 2013నుంచి కలుస్తున్నానని, క్రైస్తవ ఆధ్మాత్మికత కోసం ఆయనతో స్నేహం చేస్తున్నట్లు చెప్పాడు. ఒకసారి జెఫ్రీ ఇంట్లో రాత్రంతగా గడపడం కూడా వీరిద్దరి మధ్య పొరపచ్చాలకు దారి తీసింది. ఎంత చెప్పినా విన్పించుకోకుండా అతనితో స్నేహం కొనసాగించడంతో రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకోవాలని మిలిండా నిర్ణయం తీసుకున్నది. అప్పటి నుంచి ఆమె న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తున్నది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కారణంగా ఇద్దరు విడాకులు తీసుకోవడానికి కారణమైందని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. జెఫ్రీ ఎడ్వర్డ్ 2019 జూలై నెలలో అరెస్టు అయి, కేసు విచారణ దశలో ఉండగానే జైలులో చనిపోయాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.