FbTelugu

అతను నిజంగా అల్లు అర్జునేనా ?

స్టైలీ స్టార్ అల్లు అర్జున్ కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియోలో అల్లు అర్జున్ ఎవరూ గుర్తుపట్టలేనంతగా గడ్డంతో వాకింగ్ చేస్తూ దర్శనమిచ్చాడు. బన్నీ తాజాగా పుష్ప మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే..

ఆ మూవీలో తను గుబూరు గడ్డంతో కనిపించనున్నట్టు తెలిసిందే. అందుకోసమే తాను అలా గడ్డం పెంచుతున్నాడని తెలుస్తోంది. ఇటీవల బన్నీ వాకింగ్ కు బయటకు రాగా ఓ వ్యక్తి బన్నీని వీడియో తీశాడు. బౌన్సర్లు ఫోటోలు తీయవద్దని చెప్పినప్పటికీ అభిమానులు మాత్రం తీయడం ఆపలేదు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

You might also like