FbTelugu

కరోనా మానవత్వాన్ని చంపేస్తోందా ?

అదిలాబాద్: ప్రస్తుతం దేశంలో కరోనా భయం ఎంతలా ఉందంటే.. కరోనా సోకకుండానే చనిపోయేంతలా.. లేదా పక్కవారే చంపేసే అంతలా ఉంది. ఇలాంటి ఘటనే అదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం రాజుల మడుగు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. బతుకుదెరువు కోసం కరీంనగర్ వెళ్లిన ఓ కుటుంబం తమ సొంతూరు (రాజుల మడుగు) కు రాగా వారిని గ్రామస్తులు ఊరిబయటే అడ్డుకున్నారు.

ఆ కుటుంబంలో ఓ మహిళ పచ్చిబాలింతరాలు కావడం విశేషం. అయినా వారిని ఊళ్లోకి రానివ్వలేదు. దీంతో వారు ఆ ఊరిబయటే పసికందుతో ఐదురోజులపాటూ.. ఓ చెట్టుకిందనే ఉన్నారు. సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది అక్కడికి చేరుకొని వారికి పరీక్షలు నిర్వహించి వారికి కరోనా లేదని తేల్చిచెప్పాక ఊళ్లోకి అనుమతించారు.

You might also like