FbTelugu

కేంద్ర నిధులు కూడా మళ్లిస్తున్నారా?: హైకోర్టు

నిధులను మళ్లిస్తే విచారణకు ఆదేశిస్తాం

అమరావతి: కేంద్రం విడుదల చేసిన నిధుల్ని ఇతర అవసరాలకు మళ్లించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడుందని హైకోర్టు ప్రశ్నించింది.

ఉపాధి హామీ పథకం నిధులు మళ్లించినట్లు రుజువైతే విచారణకు ఆదేశిస్తామని  ఉన్నతాధికారులకు హైకోర్టు హెచ్చరించింది. సంవత్సరాలు గడుస్తున్నా ఉపాధి బకాయిలు చెల్లించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది.

ఏదైనా పని కోసం కేంద్రం విడుదల చేసిన నిధుల్ని ఇతర అవసరాలకు మళ్లించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడుందని ప్రేస్నిచింది. చేసిన పనులకు బకాయిలు చెల్లించకుండా నిధుల్ని ఇతరాలకు మళ్లించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌ 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌, జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డిలు ధర్మాసనం విచారణ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.