చెన్నై: యావత్ దేశమే కరోనా మహమ్మారి ప్రభావంతో అల్లాడుతుంటే.. ఇంతటి కష్టకాలంలో కొత్త పార్లమెంటు నిర్మాణం అవసరమా? అంటూ.. తమిళ స్టార్ సినీ హీరో, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కరోనా కారణంగా ఎంతో మంది ప్రజలు తమ ఉపాధిని కోల్పోయారన్నారు. ఆకలితో అల్లాడుతున్నతరుణంలో రూ.1000 కోట్లతో కొత్త పార్లమెంట్ అవసరమా అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా పేరుతో నూతన పార్లమెంటు నిర్మాణం చేపట్టింది. నూతన పార్లమెంటు నిర్మాణానికి ఇప్పటికే మోదీ భూమి పూజ కూడా చేసిన విషయం తెలిసిందే.