FbTelugu

2 వారాల్లో 3 వ్యాక్సిన్లకు అనుమతి?

న్యూఢిల్లీ: మూడు కరోనా వ్యాక్సిన్లకు కేంద్ర ప్రభుత్వం రెండు వారాల్లో పచ్చజెండా ఊపే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న వ్యాక్సిన్లు త్వరలో మార్కెట్ లోకి రానున్నాయి.

ఫైజర్, సీరం, భారత్ బయోటెక్ సంస్థలు తమ వ్యాక్సిన్లకు అనుమతులు మంజూరు చేయాలంటూ దరఖాస్తులు సమర్పించాయి. ఈ మూడు సంస్థల దరఖాస్తులను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీ.డీ.ఎస్.సీ.ఓ) లోని నిపుణుల కమిటీ బుధవారం పరిశీలించనున్నది. వ్యాక్సిన్ పనితీరు, పంపిణీ, నాణ్యత ప్రమాణాలు, భద్రత పై కమిటీ అధ్యయనం చేయనున్నది. దీనిపై కమిటీ కూడా సత్వరమే నిర్ణయం తీసుకుని కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) నివేదించనున్నారు. ఇది అందిన వెంటనే రెండు వారాల్లోపు డీసీజీఐ అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలొస్తున్నాయి.
తొలిసారి ఫైజర్ కంపెనీ దరఖాస్తు చేసుకోగా ఆ తరువాత సీరం, భారత్ బయోటెక్ లు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతులు లభించడంతో యూకేలో మంగళవారం నుంచి ఇవ్వడం ప్రారంభించారు. భారత సంతతికి చెందిన శుక్లాకు తొలి డోసు ఇవ్వనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.