FbTelugu

రేపటి నుంచే రైల్వే రిజర్వేషన్

ఢిల్లీ: రైలు సర్వీసులను క్రమంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి రిజర్వేషన్లు చేసుకునేందుకు ఐఆర్ సీటీసీ అవకాశం కల్పించింది.

దేశంలోని 15 నగరాలకు మంగళవారం న్యూఢిల్లీ నుంచి, అదే విధంగా 15 నగరాల నుంచి న్యూఢిల్లీకి ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. దిబ్రుఘర్, అగర్తలా, హౌరా, బిలాస్ పుర్, రాంచి, పాట్నా, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం, మద్గామ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూ తావి ప్రాంతాలకు రైళ్లు నడపనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది.

ఎప్పుడు బయలుదేరుతాయి, గమ్యస్థానాలకు ఎప్పుడు చేరుకుంటాయి, మధ్యలో ఏ స్టేషన్లలో ఆగుతాయనే వివరాలు తెలియచేస్తామని పేర్కొంది. ఐఆర్ సిటీసీ వెబ్ సైట్లో మాత్రమే రిజర్వేషన్ చేసుకునేందుకు సౌకర్యం కల్పించామని, టికెట్ కౌంటర్లు పనిచేయవని కేంద్ర రైల్వే శాఖ స్పష్టం చేసింది. వలస కార్మికుల కోసం ఇప్పటికే శ్రామిక్ రైళ్లను నడుపుతున్న విషయం విదితమే.

రిజర్వేషన్ ఉన్నవారినే అనుమతించడం, ఫేస్ మాస్క్ తప్పనిసరి చేశారు. ప్రతి ప్రయాణీకుడిని థర్మల్ స్కానింగ్ చేసిన తరువాతే రైలులోకి అనుమతిస్తారు. 47 రోజుల తరువాత రైల్వే శాఖ రైళ్లను పాక్షికంగా తన సర్వీసులను పునరుద్ధరించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.