హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పనిచేస్తున్న వీకే సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కి పంపించారు.
గత కొంత కాలంగా ప్రభుత్వం పై అసంతృప్తి గా ఉన్నారు. 1987 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన వీకే సింగ్ ను గతేడాది జూన్ నెలలో తెలంగాణ జైళ్ల శాఖ డీజీ నుంచి తప్పించి కమిషనర్ ఆఫ్ ప్రింటింగ్ స్టేషనరీ కి బదిలీ చేసింది. ఇలాంటి బదిలీ ఊహించలేదన్నారు. తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా పనికిరాని పోస్టులో బదిలీ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు కూడా.
ఆ తరువాత సెప్టెంబర్ నెలలో నగర శివారు తెలంగాణ పోలీసు అకాడెమీ డీజీగా బదిలీ చేసింది. అయితే కొద్ది రోజులుగా ఆయన పదవి పట్ల, ప్రభుత్వం పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పదవీ విరమణకు దగ్గరగా ఉండడంతో రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.