FbTelugu

ఐపీఎల్ వేలం… క్రిస్ మోరిస్ రికార్డు బ్రేక్!

చెన్నై: దక్షిణాఫ్రియా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. రాజస్థాన్ రాయల్స్ మోరిస్ ను రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది.

వేలం పాటలో కనీస ధర రూ.75 లక్షలు నిర్ణయించగా, ఇతని కోసం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీపడ్డాయి. ఒకరి తరువాత పెంచుకుంటూ చివరకు రాజస్థాన్ రాయల్స్ పట్టువదలకుండా మోరిస్ ను రూ.16.25 కోట్లకు దక్కించుకున్నది. ఐపీఎల్ వేలం లోనే అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్ గా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ రికార్డు సృష్టించాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.