FbTelugu

ఐపీఎల్ 13వ సీజన్ ఆదాయం అదుర్స్

వెల్లడించిన ట్రెజరర్ ధుమాల్

ముంబై: కరోనా మహమ్మారి ఉన్నా ఐపీఎల్ 13వ సీజన్ ఆదాయం గతం కన్నా బాగానే వచ్చింది. ఐపీఎల్ లాంటి మెగా టీ20 క్రికెట్ లీగ్ నిర్వహించి అందరిచేత మెప్పు పొందింది.
ప్రతి ఏటా వేసవి కాలంలో ఐపీఎల్ నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఈసారి ఆలస్యంగా యూఏఈలో నిర్వహించారు. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించారు. కాగా ఈసారి ప్రేక్షకులు లేకుండానే జరిగిపోయాయి. టోర్ని, నిర్వహణ, ఆదాయంపై బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

13వ సీజన్ నిర్వహణపై అందరూ అనుమానం వ్యక్తం చేయగా, సెక్రెటరీ జై షా ముందడుగు వేయాలని కోరారన్నారు. ప్రేక్షకులు లేకపోవడంతో, నిర్వహణ వ్యయంలో 35 శాతం తగ్గించకుని టోర్నీ నిర్వహించామన్నారు. బీసీసీఐ రూ.4వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని, గతేడాదితో పోల్చితే ఈసారి టీవీ, డిజిటల్ మాధ్యమాల వీక్షకుల సంఖ్య 25 శాతం పెరిగిందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.