FbTelugu

ఏపీ ఆర్టీఐ కమిషనర్ల భర్తీకి ధరఖాస్తులు ఆహ్వానం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ (ఎపిఐసి)లో ఖాళీగా ఉన్న రెండు రాష్ట్ర సమాచార కమిషనర్ల పోస్టుల భర్తీకి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(జిపిఎం అండ్ ఎఆర్) కె.ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ఒక చీఫ్ ఇన్పర్మేషన్ కమిషనర్, మరో ఐదుగురు స్టేట్ ఇన్పర్మేషన్ కమిషనర్లు పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఖాళీగా ఉన్నమరో రెండు రాష్ట్ర సమాచార కమిషనర్ల పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆయన తెలిపారు. ధరఖాస్తులను ఈ నెల 23వతేదీ సా.5గం.ల లోగా రిజిష్టర్ పోస్టులోగాని లేదా వ్యక్తిగతంగా గాని సెక్రటరీ, ఎపిఐసి  చిరునామాకు చేరే విధంగా పంపాల్సిందిగా ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.