FbTelugu

ఉమకు ఆహ్వానం… ఇద్దరికి దూరం దూరం…

ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ కు పరాభవం?

ఢిల్లీ: మాజీ ప్రధాని పివి.నరసింహరావుకు సోనియా గాంధీ కుటుంబం ఘోరం అవమానం చేసిందని చెబుతున్న బీజేపీ పెద్దలు, తమ పార్టీలోని ముఖ్య నేతలను కూడా అదే రీతిన అవమానానికి గురి చేస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి.

అయోధ్యలో రామ మందిరం భూమి పూజ కోసం బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి, మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ కు ఆహ్వానం పంపించిన రామ జన్మభూమి న్యాస్ ట్రస్టు, ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి లకు మొండి చేయి చూపించిందనే ఆరోపణలు వస్తున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఇద్దరు నేతలకు అవకాశం కల్పించినట్లు వార్తలొస్తున్నాయి.

You might also like