FbTelugu

భారత్ నుంచి పాక్ దిగుమతులపై దర్యాప్తు

ఇస్లామాబాద్: భారత్ నుంచి పాకిస్థాన్ దిగుమతి చేసుకుంటున్న ఔషధాలపై దర్యాప్తు చేయనున్నట్టు పాక్ ప్రధాని ఇమ్మాన్ ఖాన్ తెలిపారు. వివరాల్లోకెళితే.. భారత్ జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత పాక్ భారత్ నుంచి దిగుమతులను నిలిపివేసింది.

దీంతో పాకిస్థాన్ లో ముఖ్యమైన డ్రగ్స్‌కు కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో ప్రాణాధార డ్రగ్స్‌, వాటి ముడి ఉత్పత్తుల దిగుమతికి అనుమతి ఇచ్చింది. అయితే వీటి మాటున భారత్ నుంచి అక్రమంగా 450 ఔషధాల ట్యాబ్లెట్లు దిగుమతి అవుతున్నాయని వార్తలొచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన ఇమ్రాన్ దర్యాప్తునకు ఆదేశించారు.

You might also like