FbTelugu

ఏ.పి.పి.ఎస్.సి లో ఇంటర్వ్యూలు రద్దు

అమరావతి: ఉద్యోగ పోటీ పరీక్షల్లో మరింత పారదర్శకత కోసం ఏపి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నది. గ్రూప్ వన్ పరీక్షలతో సహా ఇతర అన్ని పరీక్షల ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ ఏపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఏ.పి.పి.ఎస్.సి నిర్వహించే అన్ని పరీక్షలకు ఇంటర్వ్యూలు ఉండవని స్పష్టం చేసింది. రాత పరీక్షల ద్వారానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపింది. త్వరలోనే విధివిధానాలు ప్రకటించనున్నది. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇకనుంచి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.