FbTelugu

అంతర్రాష్ట్ర బస్సులు రేపే పునఃప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను సోమవారం నుంచి పునః ప్రారంభించనుంది. ఆంధ్రాతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలకు బస్సులు నడపనున్నది.
ఆ రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు అనుసరించి బస్సులు నడపాలని నిర్ణయించింది. రద్దీకి అనుగుణంగా రోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంధ్రాకు బస్సులు ఉంటాయి.

కర్ణాటక రాష్ట్రానికి ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బస్సులు నడుస్తాయి. హైదరాబాద్ నగరంతో పాటు మిగతా నగరాల నుంచి కూడా బస్సులు నడవనున్నాయి. ఏపిఎస్ఆర్టీసి కూడా సోమవారం నుంచి తెలంగాణకు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విజయవాడతో పాటు మిగతా నగరాల నుంచి బస్సులు నడుస్తాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.