FbTelugu

నేడు ఢిల్లీలో ఇంటర్ నెట్ సేవలు నిలిపివేత!

* ఢిల్లీ సరిహద్దులకు భారీగా చేరుకుంటున్న రైతులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో(సింఘు, ఘాజీపూర్, టిక్రి) ఇవాళ రాత్రి 11:00 గంటల వరకు ఇంటర్ నెట్ సేవలను అధికారులు నిలిపివేయనున్నారు. ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలు తీవ్రంగా చేస్తున్న తరుణంలో.. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

పంజాబ్, రాజస్థాన్ ల నుంచి ఢిల్లీకి చేరుకుంటున్న రైతులు. ఘాజీపూర్ సరిహద్దుల్లో పోలీసుల మోహరింపు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు వెళ్లిపోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భారత గణతంత్ర దినోత్సవం రోజున రైతులు ఎర్రకోటను ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ప్రభత్వం ఢిల్లీలో కఠిన చర్యలను అమలు చేస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.