FbTelugu

ఇంటర్ నెట్ అంతరాయం… తెరుచుకోని ఫోర్టళ్లు

వాషింగ్టన్: రోడ్లపై రద్దీ పెరిగినట్లుగా ఇంటర్ నెట్ లో ఒత్తిడి పెరడంతో అప్పుడప్పుడు సర్వర్లు మొరాయిస్తుంటాయి. ఇవాళ కూడా ప్రపంచ వ్యాప్తంగా పలు వెబ్ సైట్ ఫోర్టళ్లు తెరుచుకోకుండా సతాయించాయి.

ఈ సమస్య తమకే ఎదురవుతుంతా, ఇంకా ఎవరికైనా ఉందా అంటూ సిబ్బంది ఆరా తీశారు. నిమిషాల కొద్దీ అదే పనిగా మొరాయించడంతో వీక్షకులు అసహానానికి లోనయ్యారు. సర్వర్ సమస్యలు, రద్దీ కారణంగానే అంతరాయం ఏర్పడినట్లు వార్తలొస్తున్నాయి. అంతర్జాతీయ వార్తా సంస్థలు న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్, బ్లూమ్ బర్గ్, ఫైనాన్షియల్ టైమ్స్, రెడిట్, పే పాల్, అమెజాన్.కామ్, హెచ్.బి.ఓ మాక్స్, హూ వంటి సైట్లు తెరుచుకోకుండా మొరాయించాయి. సైట్ తెరవగానే సర్వీస్ ఎర్రర్ అనే పదాలు కన్పించాయి. సర్వర్లు మెయింటెన్ చేసిన సందర్భం లేదా ఓవర్ లోడ్ కారణంగా ఇలాంటి పదాలు కన్పిస్తాయని నిపుణులు అంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.