FbTelugu

సర్కార్ స్కూళ్లకు ఇంటర్ నెట్ సౌకర్యం

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. కరోనా మహమ్మారి ఇప్పట్లో తగ్గుముఖం పట్టే పరిస్థితులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.
ఆన్ లైన్ క్లాసుల నిర్వహణకు ఇంటర్ నెట్ సౌకర్యం తప్పనిసరి అయ్యింది.

ప్రయోగాత్మకంగా రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికి నెట్ కనెక్షన్లు ఇస్తారు. బోధనకు అవసరమైన కంప్యూటర్లు, ఇతర పరికరాలను సమకూర్చుతారు. ఆ వెంటనే ఆన్ లైన్ బోధన ప్రారంభిస్తారు. ఇక్కడ విజయవంతం అయిన తరువాత మిగతా జిల్లాల్లో ఈ సౌకర్యం కల్పిస్తారు.

You might also like