FbTelugu

వ్యాక్సిన్ డోసుల విరామం పెంపుతో ప్రమాదమే

వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ల కొరత కారణంగా భారతదేశంలో మొదటి డోసుకు, రెండో డోసుకు మధ్య సమయం చాలా పెంచారు. భారత దేశాన్ని రెండు మూడు నెలలుగా వ్యాక్సిన్ల కొరత పట్టి పీడిస్తున్నది.

సెకండ్ వేవ్ మహమ్మారి గండం నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయగా, రాష్ట్రాలే లాక్ డౌన్ అమలు చేయడంతో పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కేసులు తగ్గాయంటూ మళ్లీ సడలింపులు ఇచ్చారు. ఈ సడలింపుల కారణంగా మళ్లీ కేసులు పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ కొరత నుంచి తప్పించుకునేందుకు ఒక డోసుకు, మరో డోసుకు మధ్య ఉన్న విరామాన్ని  పెంచారు. ఇది కూడా ఐసిఎంఆర్, నీతి ఆయోగ్ అధికారులతో ప్రకటన చేయించారు. దీన్ని అమెరికా అంటు వ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంథోని ఫౌచి తీవ్రంగా తప్పుపడుతున్నారు. మొదట ఆరు నుంచి 8 వారాలు ఉండేది. అది కాస్తా 12 నుంచి 16 వారాలకు పెంచారు. అంతకు ముందు మార్చి నెలలో విరామ కాలం 28 రోజులు ఉంటే సరిపోతుందని ప్రకటించారు. బ్రిటన్ లో విరామ సమయం పెంచడంతో పౌరులు పలు వేరియంట్ల బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుకు నిర్ణయించిన ప్రకారమే వ్యాక్సిన్ల విరామ సమయాన్ని అమలు చేయాలని ఆయన ప్రపంచ దేశాలకు సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.