FbTelugu

చెక్‌పోస్టు వద్ద అంబులెన్సుల అడ్డగింత

హైదరాబాద్: తెలంగాణ చుట్టూ ఉన్న సరిహద్దుల్లో కరోనా పాజిటివ్ రోగుల వాహనాల నిలిపివేత కొనసాగుతున్నది. ఏపి నుంచి వస్తున్న అంబూలెన్స్ లను జగ్గయ్యపేట గరికపాడు చెక్‌పోస్టు వద్ద తెలంగాణ పోలీసులు తనిఖీలు చేసి అనుమతి ఉంటేనే పంపిస్తున్నారు.
ఆసుపత్రి నుంచి అనుమతి లేని వాహనాలను తిప్పి పంపిస్తున్నారు. హైదరాబాద్‌లో బెడ్‌ కేటాయింపు ఉంటేనే అనుమతిస్తున్నారని, సెల్‌ఫోన్లలో అనుమతి పత్రాలను అంగీకరించట్లేదని రోగుల ఆరోపిస్తున్నారు. దీంతో రోగులు చెక్ పోస్టు వద్ద అంబులెన్సుల్లో పడిగాపులు గాస్తున్నారు. అనుమతి పత్రం లేనట్లయితే ఆసుపత్రి నుంచి ఫోన్ చేయించాలని పోలీసులు సూచిస్తున్నారు.

అదే విధంగా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో అంబూలెన్స్ లను ఆపేస్తున్నారు. సలాబాత్ పూర్ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద సరిహద్దును మూసివేశారు. మహారాష్ట్ర వాహనాలు, అంబూలెన్స్ లను తెలంగాణ పోలీసులు అనుమతించడం లేదు. సరుకు తరలించే వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. మహారాష్ట్రలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఆంక్షలు అమలు చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను కూడా తెలంగాణ సరిహద్దులో నిలిపివేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.