అమరావతి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూలై 11 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు.
విద్యా మంత్రి ఆదిమూలపు సురేశ్ సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 23లోగా కాలేజీలో పరీక్ష ఫీజు చెల్లించాలి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఒకే షెడ్యూల్ ప్రకటించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.. ప్రాక్టికల్ పరీక్షలు జూలై 1 నుంచి 4 వరకు రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి.
ప్రథమ సంవత్సరంలో పేపర్లు పాసైన అభ్యర్థులు మార్కుల్లో ఇంప్రూవ్మెంట్ కోసం ఫీజు రూ.490కి అదనంగా ఒక్కో పేపర్‌కు రూ.160 కలిపి చెల్లించాలి. సమాధాన పత్రాల రీ వెరిఫికేషన్ కమ్ స్కానింగ్ కాపీ సరఫరా, మార్కుల రీ కౌంటింగ్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 22లోగా ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.