FbTelugu

వారం రోజుల్లో ఇంటర్ ఫలితాలు

హైదరాబాద్: తెలంగాణలో మరో వారం రోజుల్లో ఇంటర్ ఫలితాలు ప్రకటించనున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులను ద్వితీయ సంవత్సరంలోకి ప్రమోట్ చేసింది కూడా.

ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మార్కులు వేసేందుకు కమిటీ ని నియమించగా, విధి విధానాలపై ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. జూలై 1వ తేదీ నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం క్లాసులు నిర్వహిస్తున్నామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. జూలై 15వ తేదీ నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు క్లాసులు ప్రారంభమవుతాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.