FbTelugu

ఇంటర్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు

విజయవాడ: ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

మే 5వ తేదీ నుంచి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని, రాష్ట్ర వ్యాప్తంగా 1452 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అత్యధికంగా తూర్పు గోదావరిలో, అత్యల్పంగా గుంటూరులో పరీక్షా కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రతి జిల్లాకు కరోనా స్పెషల్ ఆఫీసర్ ను నియమించామని, పరీక్షా కేంద్రాలను ప్రతిరోజు శానిటైజ్ చేస్తామన్నారు. ప్రతి కేంద్రంలో పారా మెడికల్ సిబ్బందితో పాటు ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.