FbTelugu

ఇంటర్ పరీక్షలు వాయిదా… మళ్లీ నిర్వహిస్తాం: సురేష్

అమరావతి: ఇంటర్‌ పరీక్షలపై పునరాలోచన చేయాల్సిందిగా ఏపి హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
పూర్తిగా కోవిడ్‌ నిబంధనల్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లో ఆరోగ్యపరమైన అన్ని నిబంధనలూ అమలు చేస్తూ… ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలని భావించామన్నారు. ఇందుకోసం కనీవినీ ఎరుగని విధంగా ఏర్పాట్లు కూడా చేశామని మంత్రి సురేష్ వివరించారు.

అయినా, దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు, ఇందుకు సంబంధించిన వార్తల పట్ల పరీక్ష రాయాల్సిన పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే పరీక్షల నిర్వహణ మీద పునరాలోచన చేయాలని రాష్ట్ర హైకోర్టు కూడా అభిప్రాయపడినందున, కోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షల వాయిదాను ప్రకటిస్తున్నామన్నారు. ఈ పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఇదే విషయాన్ని రేపు హైకోర్టుకు కూడా తెలియజేస్తామని మంత్రి సురేష్ ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.