FbTelugu

జూలై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు

అమరావతి: జూలై మొదటివారంలో ఇంటర్మీడియ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా కేసులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
అదే విధంగా జూలై చివరి వారంలో టెన్త్ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చామని మంత్రి సురేష్ మీడియాకు తెలిపారు. విద్యార్థుల ప్రయోజనం కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామని, తమ నిర్ణయం మూలంగా పోటీ పరీక్షల్లో రాటుదాలుదేరుతారని ఆయన చెప్పారు.

ఇంటర్ పరీక్షలకు సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్షల నిర్వహణకు రెండు వారాల ముందు షెడ్యూలు ప్రకటించాలన్నారు. అయితే ఈ నెల 20 వరకు కరోనా కర్ఫ్యూ ఉండడంతో అప్పటి వరకు వేచి ఉంటామన్నారను. వచ్చే నెలలో ఇంటర్ పరీక్షలు నిర్వహించి, ఆగస్టు నెలలో ఎంసెట్ నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ లో తరగతులు ప్రారంభమవుతాని మంత్రి సురేష్ వివరించారు.
1998 డిఎస్సి అభ్యర్థుల సమస్య చాలా కాలంగా నలుగుతోందని, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ డిఎస్సిలో ఎంపికైన 36 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.