FbTelugu

ఇంటర్, టెన్త్ పరీక్షలు నిర్వహిస్తాం: ఏపి విద్యాశాఖ మంత్రి

అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలు యధాతథంగా నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

స్కూల్లో కరోనా విస్తరించిన నేపథ్యంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు సెలవులు ప్రకటిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల నుంచి తల్లిదండ్రులకు వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండడంతో సెలవులు ప్రకటించామన్నారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. కరోనా ఉన్నప్పటికీ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, రద్దు చేసే ప్రసక్తి లేదని అన్నారు. పరీక్షలు నిర్వహిస్తున్నందున రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడం కాని, నైట్ కర్ఫ్యూ కాని విధించే పరిస్థితులు ఉండకపోవచ్చనేది స్పష్టమవుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.