FbTelugu

చైనాపై తీవ్రస్థాయిలో విచారణకు సిద్ధం: ట్రంప్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కరోనా పుట్టుకకు, వ్యాప్తికి సూత్రదారి, పాత్రదారి చైనానే అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కరోనా వ్యాప్తి విషయంలో చైనాపై తీవ్రస్థాయిలో విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ ప్రకటించారు.

చైనా తీరు తనకు అస్సలే నచ్చడం లేదని తెలిపారు. కరోనాను నియంత్రించేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఏమాత్రం చైనా ప్రయత్నాలు చేయలేదని అన్నారు. ప్రస్తుతం చైనా నాసీరకమైన కరోనా టెస్టింగ్ కిట్లను పంపిందని అమెరికా వైట్ హౌస్ ఆరోపించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.