FbTelugu

తిరుపతి ఏయిర్ పోర్టులో మంత్రి కి పరాభవం

తిరుపతి: విమానాశ్రయంలో విఐపి గేట్ లోపలకు రానీయకుండా కేంద్ర భద్రతా సిబ్బంది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బలంగా తోసేశారు. ఈ ఘటనతో ఆయన కిందపడిపోయారు.

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ కు వీడ్కోలు పలికేందుకు రాజేంద్రనాథ్ రెడ్డి తిరుపతి విమానాశ్రయం చేరుకున్నారు. విఐపి గేటు లోపలకు వెళ్లనీయకుండా కేంద్ర భద్రతా సిబ్బంది ఆయనను తోసేయడంతో వీడ్కోలు పలకలేకపోయారు. తనను అడ్డుకున్నవారి వివరాలు ఇవ్వాలని విమానాశ్రయ అధికారులను రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. అయితే విమానాశ్రయ అధికారులు మంత్రికి సర్దిచెప్పి పంపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.