FbTelugu

విద్యార్థి అనుమానాస్పద మృతిపై విచారణ

కర్నూలు: వెల్దుర్తి ఎస్సీ గురుకుల కళాశాల విద్యార్థిని పుష్పలత అనుమానాస్పద మృతిపై విచారణకు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు.

వెల్దుర్తి పట్టణ సమీపంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థిని పుష్పలత(16) శనివారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సహచర విద్యార్థినులతో కలిసి ఉదయం పరీక్షకు హాజరై మధ్యాహ్నం భోజనం ముగించుకుని హాస్టల్‌ గదికి వెళ్లింది. తర్వాత 2 నుంచి 3 గంటల మధ్య స్టడీ అవర్స్‌ లో విద్యార్థిని కనిపించలేదు. ఎంతకూ కన్పించకపోవడంతో కేర్‌ టేకర్‌ హరిప్రియ, మరికొందరు విద్యార్థినులు కలిసి వెతికారు.

హాస్టల్‌ పైభాగం మెట్ల మీద పుష్పలత పడిపోయి కనిపించింది. వెంటనే ప్రిన్సిపాల్‌ సునీతకు సమాచారం అందించారు. పుష్పలతను వెంటనే ప్రైవేటు వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.