FbTelugu

హాస్పిటళ్ల దురాగతం… గర్భిణీ మృతిపై విచారణ

హైదరాబాద్: కార్పొరేట్ హాస్పిటళ్లు అడ్మిషన్ కు నిరాకరించడంతో నిండు గర్బిణీ తిరిగి తిరిగి అంబూలెన్స్ లోనే ప్రాణాలొదిలిన ఘటన పై మడేచల్ జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

ఈ ఘటన రాష్ట్రంలోని పలువురిని కలచివేసింది. మల్లాపూర్ కు చెందిన నిండు గర్భిణీ పావని ప్రసవం కోసం పలు హాస్పిటళ్లకు వెళ్లగా ఎవరు కూడా చేర్చుకోకుండా నిరాకరించారు. కరోనా ఉందేమోనన్న భయంతో అడ్మిషన్ ఇవ్వకపోవడంతో అంబూలెన్స్ లో ఆమె ప్రాణాలు విడిచింది. ఈ దారుణ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి స్పందించారు. జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు పావని నివాసానికి డిఎం అండ్ హెచ్ఒ డాక్టర్ మల్లిఖార్జున్ వెళ్లి అడ్మిషన్ నిరాకరణపై వివరాలు సేకరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.