FbTelugu

స్వర్ణ ప్యాలెస్ పై విచారణ కొనసాగించాలి: సుప్రీం

హైదరాబాద్: విజయవాడలో స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది.

జస్టిస్ నారిమన్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. తదుపరి చర్యలు నిలిపివేయాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం పక్కన పెట్టింది. రమేశ్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ రమేష్ చౌదరి, ఛైర్మన్‍పై కస్టోడియల్ విచారణ చేయవద్దని సూచించింది.  హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. ప్రమాద దర్యాప్తును నిలిపివేయాలనడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

You might also like