FbTelugu

ఎల్జీ పాలిమర్స్ లెక్క తేల్చండి: టీడీపీ డిమాండ్

ఆన్ లైన్ లో టీడీపీ జనరల్ బాడీ

హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా తెలుగుదేశం పార్టీ జనరల్ బాడీ సమావేశం ఆన్ లైన్ లో జరిగింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు.

పోలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పార్టీ బాధ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి దుర్ఘటన  మృతులకు సంతాపంగా 2 నిమాషాలు మౌనం పాటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.

రాష్ట్రంలో 6 దశాబ్దాల క్రితం నుంచి ఏయే ప్రభుత్వాలు ఈ కంపెనీకి భూములు ఇచ్చాయో, అనుమతులు ఇచ్చారో సాక్ష్యాధారాలు ఉన్నాయని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే పాలి స్టైరీన్ కు, ఎక్స్ పాండబుల్ పాలి స్టైరీన్ విస్తరణకు ఎల్జీ పాలిమర్స్ కు అనుమతి ఇచ్చింది. అంతే కాకుండా కేంద్రానికి సిఫారసు చేసిన లేఖలు కూడా తమ వద్ద ఉన్నాయి.

గ్యాస్ లీకేజికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కు వత్తాసు పలుకుతూ బాధితులపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ తీర్మానం ఆమోదించారు. ఈ దుర్ఘటనకు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి నైతిక బాధ్యత వహించాలి. ఎల్జీ పాలిమర్స్ ను తక్షణమే అక్కడనుంచి తరలించాలి.

ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మానవ తప్పిదమే. 20డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉండాల్సిన స్టైరీన్, 130-150డిగ్రీలకు చేరిందంటే అది కంపెనీ తప్పిదం కాక మరేమవుతుంది. సెల్ఫ్ పాలిమరైజేషన్ కు కెమికల్ కలపాల్సి వుండగా, కలపకుండా వదిలేశారు. అక్కడ పండించే పంటలు తినవద్దని, పాలు తాగవద్దని, గడ్డి పశువులకు వేయవద్దని, అక్కడి రోడ్లపై, ఇళ్లలో ఇంకా 1.7పిపిఎం స్టైరీన్ అవశేషాలు ఉన్నాయని సిఎస్ ఐఆర్- నీరి నిపుణులు హెచ్చరించారు. ఈ నిజాలను కప్పిపుచ్చి, ఎల్జీ పాలిమర్స్ పరిసర గ్రామాల్లో అంతా బాగానే ఉందని మంత్రులు ప్రచారం చేయడాన్ని ఖండించారు.

ద్రవరూపంలో ఉండే స్టైరీన్ గ్యాస్ రూపంలో ఎలా మారిందో చెప్పాలి. 500మీటర్ల పరిధి కూడా వ్యాపించలేని గ్యాస్ 3కిమీ-5కిమీ పరిధిలో ఎలా వ్యాపించిందనే తేల్చాలి. సైరన్ ఎందుకు మోగలేదో విచారించాలి. దుర్ఘటన ప్రాంతానికి సీఎం జగన్ వెళ్లకుండా, కంపెనీ ప్రతినిధులను విమానాశ్రయంలో ఏ ప్రాతిపదికన కలిశారనే ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని తీర్మానించారు.

బాధిత ప్రజల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే ప్రమాదం ఉంది. వీరికి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు పర్మినెంట్ గా మెయింటైన్ చేయాలి. అవన్నీ సమగ్రంగా పరిశీలించాకే దానిని బట్టి, బాధితులకు నష్ట పరిహారం నిర్ణయించాలి. లీకేజి దుర్ఘటనలో 3కిమీ కంటే ఎక్కువ పరిధిలో విష వాయువులు వ్యాపిస్తే, కేవలం 1 కిమీ పరిధిలోని ప్రజలకే ఆర్ధిక సాయం అందించడం శోచనీయం.

కరోనా వైరస్ తో జనం చస్తే చస్తారు, బతికితే బతుకుతారు. కరోనాతో చనిపోయినా 3%మందే కదా అనే తేలిక భావంతో వైసిపి నాయకులు మొండిగా చెబుతున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా ఈనెల 28నుంచి సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.