FbTelugu

పిచ్చికుక్క స్వైర విహారంతో గాయాలు

Injuries-with-mad-dog

ప.గో జిల్లా: జీలుగుమిల్లి మండలం లక్ష్మీ పురం గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారంతో పలువురికి గాయాలయ్యాయి. ముగ్గురిని పిచ్చి కుక్క కరవగా, లక్ష్మీ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను జీలుగుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. రాత్రి వీధిలైట్ లు ఉన్నా వెలగకపోవటం తోనే ప్రమాదం జరిగింది అని గ్రామస్తులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాత్రిపూట కర్రలతో తిరిగే పరిస్థితి వచ్చిందంటున్నారు. అయినప్పటికీ ఎప్పుడు ఎవర్ని కరుస్తుందో అని భయాందోళన లో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు.

You might also like