FbTelugu

పరిషత్ ఎన్నికలపై విచారణ మొదలు

అమరావతి: ఆంధ్రాలో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతున్నది. నిన్న సింగిల్ బెంచ్ తీర్పుపై సవాలు చేస్తూ ఎస్ఈసి రాత్రి హైకోర్టు డివిజను బెంచిని ఆశ్రయించింది. కొద్ది సేపటి క్రితమే డివిజన్ బెంచ్ విచారణ ప్రారంభం అయ్యింది.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో సంబంధం లేకుండా రిటర్నింగ్ అధికారులు ఎన్నికల సామగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపిస్తున్నారు. డివిజన్ బెంచ్ తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని అటు అధికారులు, ఇటు వైసిపి సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే బిజెపి, జనసేన, టిడిపి నాయకులు మాత్రం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని డివిజన్ బెంచ్ సమర్దిస్తుందని అంటున్నారు. డివిజన్ బెంచ్ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రానట్లయితే ఎస్ఈసి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసి) సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి తరుపున వాదనలు వినిపిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.