FbTelugu

పరిగిలో అమానుష ఘటన

వికారాబాద్: మానవత్వం తలదించుకునేలా ఒక కుమారుడు వ్యవహరించాడు. తన తండ్రికి బ్లాక్ ఫంగస్ లక్షణాలుండడంతో చికిత్స చేయించకుండా హాస్పిటల్ లోనే వదిలేసి వెళ్లిపోయాడు.

రుక్కుంపల్లికి చెందిన చంద్రయ్య (63) ఈ నెల 3వ తేదీన కరోనా పాజిటివ్ సోకగా తాండూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. పాజిటివ్ తగ్గిపోవడంతో ఇంటికి వెళ్లిపోయాడు. బుధవారం నాడు బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడడంతో పాటు, కన్ను, నుదుటి భాగంలో వాపు వచ్చాయి. డాక్టర్లకు చూపించేందుకు పరిగి హాస్పిటల్ కు తీసుకు రాగా బ్లాక్ ఫంగస్ వచ్చిందని, హైదరాబాద్ కు తీసుకువెళ్లాలని సూచించారు. నా వల్ల కాదంటూ కన్న కొడుకు తండ్రిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. చంద్రయ్య దిగాలుతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పడిగాపులు కాస్తున్నాడు. డాక్టర్లు అతన్ని హైదరాబాద్ లోని మహవీర్ ఆసుపత్రికి పెంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.