FbTelugu

ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మీదేవీ అలంకారం

విజయవాడ: శ్రావణ మాసం రెండవ శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ వరలక్ష్మీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నది. కరోనా దృష్ట్యా దేవస్ధానం వారిచే వరలక్ష్మీ దేవి వ్రతం నిర్వహిస్తున్నారు.

ప్రతీ ఏడాది నిర్వహించే సామూహిక, ఉచిత వరలక్ష్మీ దేవి వ్రతాలు, ఆర్జిత సేవలు కరోనా కారణంగా రద్దు చేశారు. దుర్గగుడి అధికారులు భక్తజనులు పూజల్లో పాల్గొనేందుకు అనుమతి నిరాకరించారు. వరలక్ష్మీ దేవి వ్రతంలో భక్తులకు పరోక్ష పూజల ద్వారా  గోత్రనామాలతో జరిపేందుకు మాత్రమే అవకాశం కల్పించారు.

వరలక్ష్మీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను ఎమ్మెల్యే ఆర్కే రోజా, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట‌రమణ దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

You might also like