FbTelugu

ఆ విమానం గల్లంతు అయ్యింది: ఇండోనేషియా

జకార్తా: జకార్తా నుంచి పోంటియానక్ కు బయలుదేరిన విమానం గల్లంతు అయినట్లు ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. రాడార్ సమాచారాన్ని విశ్లేషిస్తున్నట్లు రవాణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అదిత ఇరావతి తెలిపారు.

నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏన్సీ, జాతీయ ట్రాన్స్ పోర్టేషన్ సెప్టీ కమిటీ సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు చేస్తున్నాయని ప్రకటించారు. జకార్తా నుంచి 62 మంది తో ఎయిర్ బోయింగ్ శ్రీ విజయ విమానం బయలుదేరిన నాలుగు నిమిషాలకు కుప్పకూలింది. ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానం జావా సముద్రంలో కూలినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. థౌజండ్ ద్వీపాల్లో విమనా శకలాలను గుర్తించినట్లు జాలర్లు చెబుతున్నారని స్థానిక మీడియా వెల్లడించింది.

ఇండోనేషియాలో రవాణా సదుపాయాలు స్వల్పంగా ఉండడంతో ప్రమాదాలు సర్వసాధారంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రయాణీకుల భద్రత విషయంలో సరైన నిబంధనలు పాటించకపోవడంతో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.