FbTelugu

జగన్ ఫొటోతో.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం!

నెల్లూరు: స్థల వివాదంలో జగన్ ప్రభుత్వంలో తనకు న్యాయం జరగడం లేదంటూ.. సీఎం జగన్ ఫొటో చేతపట్టుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన జిల్లాలోని గూడూరులో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంచు కృష్ణయ్య అనే వ్యక్తి తన స్థల వివాదం సీఎం జగన్ ప్రభుత్వంలో పరిష్కారం కావడం లేదంటూ.. గూడురులోని స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద సీఎం ఫొటో పట్టుకొని పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతనిని స్థానికులు గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

You might also like