FbTelugu

ఆసిస్ పై భారత్ ఘన విజయం

* 2-1తో సిరీస్ కైవసం

*  7 వికెట్ల నష్టానికి 328 పరుగులు

ఎంతో ఉత్కంఠబరితంగా సాగిన భారత్, ఆస్ట్రేలియా చివరి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియా కంగారులను తమ సొంతగడ్డపైనే టీమ్ ఇండియా కంగుతినిపించింది. నిర్ధేశిత 328 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు మిగిలి ఉండగానే సాధించింది.

చివరి మ్యాచులో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ (89 పరుగులు) చివరి వరకు క్రీజులో నిలిచి భారత్ ను గెలుపు తీరాలకు చేర్చాడు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ కు 4, స్పిన్నర్ నేథన్ లైయన్ కు 2 వికెట్లు దక్కాయి. ఈ సిరీస్ లో 21 వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్ కు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్ లో గిల్ 91 పరుగులు చేయగా, పుజారా 56 పరుగులు సాధించాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.